Raghuvaran BTech : రఘువరన్ బీటెక్ రీరిలీజ్ డేట్ ఫిక్స్.. (పోస్ట్)

by sudharani |
Raghuvaran BTech : రఘువరన్ బీటెక్ రీరిలీజ్ డేట్ ఫిక్స్.. (పోస్ట్)
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush).. హీరోగా, డైరెక్టర్‌గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన కుబేర (Kubera), ఇడ్లీ కడై (Idli Kadai) వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ధనుష్ కెరీర్‌లోనే యువతను ఉర్రూతలూగించిన చిత్రం ‘రఘువరన్ బీటెక్’ (RaghuvaranBtech). ఆర్. వేల్‌రాజ్ (R. Velraj) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అమలాపాల్ (Amalapal) హీరోయిన్‌గా నటించింది. 2015లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో యువతని ఓ రేంజ్‌లో ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.

‘రఘువరన్ బీటెక్’ చిత్రం వచ్చి దాదాపు 10 సవత్సరాలు కావస్తుండగా.. ఇప్పుడు ఈ మూవీ రీరిలీజ్‌కు సిద్ధం అయింది. తెలుగులో ఈ చిత్రాన్ని 2025 జనవరి 4న రీ రిలీజ్ చేయబోతున్న ప్రకటించింది శ్రీస్రవంతి మూవీస్. ఈ మేరకు X వేదికగా.. ‘బిగ్ స్క్రీన్‌లో మరోసారి మ్యాజిక్‌ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి.. ‘రఘువరన్ బీటెక్’ RaghuvaranBtech 4 జనవరి 2025న మళ్లీ విడుదల కానుంది!’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. యూత్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story