Pushpa 2: వెయ్యి కోట్ల క్లబ్బులో చేరి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ‘పుష్ప 2’

by Prasanna |
Pushpa 2:  వెయ్యి కోట్ల క్లబ్బులో చేరి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన  ‘పుష్ప 2’
X

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా, రష్మిక మందన్న( Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన సినిమా "పుష్ప 2" (Pushpa 2). సుకుమార్ ( Sukumar ) దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 5 న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం, "పుష్ప 2" మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా రూ.294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. నార్త్ లో కూడా దూసుకెళ్తుంది. తాజాగా, బాలీవుడ్ మూవీని తలపించేలా మరో రికార్డును క్రియోట్ చేసింది.

కేవలం ఆరు రోజుల్లోనే రూ. వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్‌ను చేరి, ఇండియన్ మూవీస్ లో మొదటి సినిమాగా నిలిచింది. . పుష్ప 1 (Pushpa) కి వచ్చిన క్రేజ్‌ పుష్ప 2 కి చాలా ప్లస్ అయింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా అందరి మనసులను గెల్చుకుంది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు రూ. 1000 కోట్ల క్లబ్‌లో బాహుబలి 2 (Baahubali2) 10 రోజుల్లో చేరింది.

" పుష్ప 2 " మూవీలో అల్లు అర్జున్ మాస్ పెర్ఫార్మెన్స్, గంగాలమ్మ జాతర ఎపిసోడ్, బీజీఎం ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. హిందీలో ఎవరూ ఊహించలేని విధంగా రెట్టింపు కలెక్షన్స్ రాబడుతోంది. రూ. 1000 కోట్ల క్లబ్‌లో పుష్ప 2 చేరడంతో టాలీవుడ్ రేంజ్ కూడా అమాంతం పెరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed