PRANITHA: స్టార్ హీరోయిన్ బేబీ షవర్ సెలబ్రేషన్స్.. నెట్టింట ఆకట్టుకుంటున్న ఫొటోలు

by Kavitha |
PRANITHA: స్టార్ హీరోయిన్ బేబీ షవర్ సెలబ్రేషన్స్.. నెట్టింట ఆకట్టుకుంటున్న ఫొటోలు
X

దిశ, సినిమా: ‘బావ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీత అందరికీ సుపరిచితమే. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. అలా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాతో ఒక్కసారిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నది. కానీ, అనుకున్నంత స్టార్‌డమ్ అయితే రాలేదు. దీంతో ఈ అమ్మడు సుభాష్ అనే బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకుంది. ఇక వీరికి ఒక పాప కూడా జన్మించింది. అయితే రీసెంట్‌గా 'రౌండ్ 2 ఇక ఈ ప్యాంట్స్ సరిపోవు' అంటూ.. తాను రెండోసారి తల్లి అవుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా బేబీ బంప్‌తో ఉన్న కొన్ని ఫొటోస్ షేర్ చేశారు. ఇక అప్పటి నుంచి ప్రణీత ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ ఫొటోల్ని పోస్ట్ చేస్తునే ఉంది. ఈ క్రమంలో ఈమె ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ప్రణీత తన బేబీ షవర్ సెలబ్రెషన్స్ పిక్స్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. అందులో వైట్ డ్రెస్ వేసుకొని ఫొటోలకు పోజులిచ్చింది. అంతేకాకుండా అలానే ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయని క్యాప్షన్ జోడించింది. అయితే ఈ సెలబ్రెషన్స్‌ కేవలం కొంత మంది సమక్షంలోనే నిర్వహించారని తెలుస్తున్నది. ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.

(video link credits to pranitha instagram id)

Advertisement

Next Story