- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ హీరోయిన్ కోసం స్పెషల్గా లంచ్ బాక్స్ పంపించిన ప్రభాస్.. ఫొటోలు వైరల్

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘ఫౌజీ’ (Fauji)ఒకటి. డైరెక్టర్ హను రాఘవపూడి(Director Hanu Raghavapudi) తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో యంగ్ బ్యూటీ ఇమాన్వి (Imanvi) హీరోయిన్గా నటిస్తుంది. అయితే.. ఈ సినిమా షూటింగ్పై గత కొద్ది రోజులుగా నెట్టింట రూమర్స్ షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వారం నుంచి ‘ఫౌజీ’ కొత్త షెడ్యూల్ను హైదరాబాద్లో స్టార్ట్ చేయనున్నారని.. ఈ షూటింగ్లో ప్రభాస్ కూడా పాల్లొననున్నాడని, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని వార్తలు వచ్చాయి. కానీ వీటిపై చిత్ర బృందం మాత్రం ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. కానీ, తాజాగా నెట్టింట ఓ పోస్ట్ ప్రత్యక్షమైంది. దీంతో ఫౌజీ షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఇమాన్వి తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో చాలా ఫుడ్ ఐటెమ్స్ ఉండగా.. ‘ఇంత మంచి ఫుడ్ పంపినందుకు థాంక్యూ ప్రభాస్’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘మొదలు పెట్టాడండీ ఈ సారు’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా.. ప్రస్తుతం ‘ఫౌజీ’ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ(Ramoji Film City)లో జరుగుతుందని తెలుస్తుండగా.. సెట్స్లో బ్రేక్ టైంలో ప్రభాస్ పంపిన ఫుడ్ ఎంజాయ్ చేశారు చిత్ర బృందం. అయితే 1974 బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో.. ప్రభాస్ డబుల్ యాంగిల్లో కనిపించనున్నారని టాక్.