- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
MLA vs Hydra: నోటీసులు ఇచ్చి హైడ్రా లావాదేవీలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
by Prasad Jukanti |

X
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: హైడ్రాపై (Hydra) అధికార పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి (Anirudh Reddy) సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇవాళ అనిరుధ్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) పోన్ లిఫ్ట్ చేయడం లేదని, ఆయన రెస్పాడ్ కావడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యేకే స్పందించకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మ్యాన్ హట్టన్ ప్రాజెక్టుపై మరోసారి సీఎంకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఖాజాగూడలోని కొత్తకుంటలో వంశీరాం బిల్డర్లు నిర్మాణాల విషయంలో ఇటీవల హైడ్రా తీరుపై ఎమ్మెల్యే అనిరుధ్ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Next Story