pooja Hegde: ఈ కథకు నా పాత్ర వెన్నెముక.. బుట్ట బొమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |
pooja Hegde: ఈ కథకు నా పాత్ర వెన్నెముక.. బుట్ట బొమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ సినిమాతోనే మంచి స్టార్ డమ్ అందుకుంది. ఆ తర్వాత ‘ముకుంద’, ‘డీజే’, ‘రంగ స్థలం’, ‘సాక్ష్యం’, ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అలా వైకుంఠపురంలో’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ భామకు అనుకున్నంతగా విజయాలు దక్కలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ కూడా అడపాదడపా చిత్రాల్లో నటించి అలరించింది. అయితే గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరం అయిన ఈ బ్యూటీ.. ప్రజెంట్ వరుస సినిమాలతో మెప్పించడానికి రెడీ అవుతోంది. అందులో భాగంగా ‘దేవా’, ‘సూర్య 44’, ‘దళపతి 69’, ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ వంటి సినిమాల్లో నటిస్తోంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా.. తాను నటిస్తోన్న ‘సూర్య 44’ సినిమా గురించి, హీరో సూర్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘ప్రేమ, యుద్ధం, నవ్వు.. ఈ మూడింటి చుట్టూ తిరిగే కథనే సూర్య 44. ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. ఈ కథకు నా పాత్ర వెన్నెముక. సూర్య లాంటి సూపర్ స్టార్ నటిస్తున్న చిత్రంలో ఇంత ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కడం నిజంగా అదృష్టమే. షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నది. అందరితోపాటు నేనూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ పొడుగు కాళ్ళ సుందరి చెప్పుకొచ్చింది. కాగా ‘సూర్య 44’ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed