పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీలో మెగాస్టార్.. ఫుల్ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!

by Hamsa |   ( Updated:2024-10-06 12:11:11.0  )
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీలో మెగాస్టార్.. ఫుల్ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాల్లో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం డార్లింగ్ రాజా సాబ్, కల్కి-2, సలార్-2, ఫౌజీ, స్పిరిట్ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఇందులో ‘స్పిరిట్’ సందీప్ రెడ్డి దర్శకత్వంలో రాబోతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనిని టి-సిరిస్, భధ్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. అయితే ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.

ఈ క్రమంలో.. నిత్యం స్పిరిట్‌‌కు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ విలన్స్‌గా నటించబోతున్నట్లు టాక్. తాజాగా, ఇప్పుడు స్పిరిట్ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించబోతున్నట్లు పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ టీమ్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story