సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘విశ్వంభర’.. మెగాస్టార్‌కు థాంక్స్ చెప్పిన దిల్‌రాజు

by Gantepaka Srikanth |
సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘విశ్వంభర’.. మెగాస్టార్‌కు థాంక్స్ చెప్పిన దిల్‌రాజు
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం విశ్వంభర. యువ దర్శకుడు వశిష్ట దీనిని తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ త్రిష, యంగ్ బ్యూటీ అశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దసరా వేళ విశ్వంభర(Vishwambhara) చిత్రం నుంచి మేకర్లు కీలక అప్డేట్ ఇచ్చారు. సంక్రాంతి(Sankranthi) బరి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి విడుదల అవుతున్న నేపథ్యంలో చిరంజీవి తప్పుకున్నారు. దీంతో మెగాస్టార్‌కు, విశ్వంభర చిత్ర నిర్మాతలకు గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్‌రాజు ధన్యవాదాలు చెప్పారు. మరోవైపు హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్‌‌గా విశ్వంభర తెరకెక్కుతోంది. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌.. సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది. దసరా సందర్భంగా ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed