- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మెగా ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.. ‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతుందంటూ హైప్ పెంచిన మేకర్స్ (ట్వీట్)

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ సాధించారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’(Vishvambhara). ఈ మూవీకి వశిష్ట(Vasishta) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం సోషియోఫాంటసీ తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీకృష్ణారెడ్డి(Vamsi Krishna Reddy), ప్రమోద్ ఉప్పలపాటి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడుతూ వస్తుంది. అయితే ‘విశ్వంభర’ మే 9న విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్ తప్ప ఎలాంటి అప్డేట్స్ రిలీజ్ కాలేదు. ఇక భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా అభిమానులు ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘శోబీమాస్టర్ కొరియోగ్రఫీలో మెగాస్టార్ ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణతో పాటు విశ్వంభర కీలక సీన్స్‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. సెన్సేషనల్ ట్యూన్‌లో డ్యాన్స్ చేస్తూ, తన ఎలిమెంట్స్‌లో ఈ పాట చూడటం ఒక ట్రీట్ అవుతుంది. మెగా మాస్ బియాండ్ యూనివర్స్ కోసం సిద్ధంగా ఉండండి’’ అని రాసుకొచ్చారు. అలాగే చిరు మాస్ మాస్ లుక్‌లో కార్ డోర్ తీస్తున్నట్లు ఉన్న ఫొటోను షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ చూసిన వారంతా ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వెయిట్ చేస్తున్నారు.
#Vishwambhara shooting underway with MEGASTAR'S introduction song being shot under the choreography of @shobimaster ❤️🔥
— BA Raju's Team (@baraju_SuperHit) February 15, 2025
This song will be a treat to watch with MEGASTAR in his element, dancing to the sensational tune by @mmkeeravaani 💥💥
Get ready for MEGA MASS BEYOND UNIVERSE… pic.twitter.com/zjVN3yzVWI