పెళ్లికి ముందే లావణ్య లవ్ ఎఫైర్.. టాలీవుడ్ నటుడితోనే!

by Hamsa |   ( Updated:2023-10-26 05:16:00.0  )
పెళ్లికి ముందే లావణ్య లవ్ ఎఫైర్.. టాలీవుడ్ నటుడితోనే!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి త్వరలో మెగా కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. లావణ్య, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొద్ది రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు. వీరిద్దరు పెద్దలను ఒప్పించి మరీ ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. అలాగే ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోబోతున్నారు. ఈ క్రమంలో ఇటీవల మెగా ఇంట్లో చిరంజీవి వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కూడా నిర్వహించి ఈ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే కొన్ని రోజుల నుంచి మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, లావణ్య త్రిపాఠి ఇంతకు ముందే ఓ టాలీవుడ్ హీరోను ప్రేమించిందని డబ్బు కారణంగా వదిలేసిందని ఓ వార్త నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. అసలు మ్యాటర్‌లోకి వెళితే.. లావణ్య త్రిపాఠి, నవీన్ చంద్ర కలిసి ‘అందాల రాక్షసి’ మూవీలో నటించారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారట. అంతేకాకుండా వీళ్ల మధ్య ప్రేమాయణం కూడా నడిచిందని అప్పట్లో టాక్ వచ్చిన విషయం తెలిసిందే. మరోసారి ఇప్పుడు లావణ్య ప్రేమ వ్యవహారం నెట్టింట వైరల్ అవుతోంది. డబ్బు కోసమే నవీన్‌ను వదిలేసి వరుణ్ ని ప్రేమించిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నవీన్ చంద్ర లావణ్య మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అని మెగా ఫాన్స్ లావణ్యకు సపోర్ట్ చేస్తున్నారు.

Advertisement

Next Story