Game Changer: ఆ సాంగ్ కోసం ఎంతో కష్టపడ్డా కియారా.. వీడియో వైరల్

by sudharani |
Game Changer: ఆ సాంగ్ కోసం ఎంతో కష్టపడ్డా కియారా.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), కియారా అద్వానీ (Kiara Advani) జంటగా నటిస్తు్న్న చిత్రం ‘గేమ్ చేంజర్’(Game Changer). శంకర్ (Director Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రాన్ని దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ‘గేమ్ చేంజర్’ పై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా.. ఈ సినిమా నుంచి రిలీజైన ‘నానా హైరానా’ సాంగ్ అత్యధిక వ్యూస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదే జోష్‌లో తాజాగా వచ్చిన ‘దోప్’ లిరికల్ సాంగ్ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ వన్‌గా నిలిచింది. ఈ సాంగ్‌లో రామ్ చరణ్, కియారా మాస్ స్టెప్పులతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ సాంగ్ కోసం కియారా ఎంత కష్టపడిందో తెలుపుతూ ఓ వీడియో షేర్ చేసింది. ఈ మేరకు సాంగ్ గురించి వివరిస్తూ.. ‘సెట్‌లో 13 రోజుల పాటు సినిమా పాటను షూట్ చేయడం ఇదే మొదటిసారి. ఇలా కొత్త స్టైల్ డ్యాన్స్ డబ్‌స్టెప్/ క్లాసికల్/ రోబోటిక్/ హిప్ హాప్ వంటి కొత్తదానాన్ని నేర్చుకోవడం మనం చేస్తున్న వృత్తికి అందం. కాస్ట్యూమ్స్ అండ్ ఫ్యాన్సీ హెయిర్, మేకప్‌తో నేను ఈ పాట కోసం ఎంతో అద్భుతమైన వ్యక్తులతో కలిసి పని చేశాను! ఇంకా ఈ సినిమా నుంచి మరిన్ని అద్భుతాలు చూస్తారు’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. భారీ అంచనాల మధ్య ఈ మూవీ సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Advertisement

Next Story

Most Viewed