- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Janhvi Kapoor: ‘పుష్ప-2’ ను తక్కువ చేసి చూస్తున్నారు చాలా బాధగా ఉంది.. జాన్వీ కపూర్ పోస్ట్
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule). సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో.. ‘పుష్ప-2’ మూవీ వల్ల హాలీవుడ్ సినిమా ‘ఇంటర్‌స్టెల్లార్’(Interstellar) రీ రిలీజ్ వాయిదా పడిందని నెటిజన్లు పలు విమర్శలు చేస్తున్నారు. పలు పోస్టులు పెడుతూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.
తాజాగా, దీనిపై జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. ‘‘పుష్ప-2 కూడా సినిమానే కదా. ఎందుకు మరొకదానితో దీన్ని పోలుస్తూ తక్కువ చేసి చూస్తున్నారు. మీరు ఏదైతే హాలీవుడ్(Hollywood) చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్నారో.. వారే మన సినిమాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ మనం మాత్రం మన మూవీస్‌ను తక్కువ చేసుకుంటూ మనల్ని మనమే అవమానించుకుంటు ఉండిపోతున్నాం. ఇలాంటివి చూసినప్పుడు బాధగా ఉంటుంది’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.