- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Saptagiri : థియేటర్లలో పెళ్లి బాజాలు మోగుతాయి.. ఇంట్రెస్టింగ్‌గా సప్తగిరి కొత్త సినిమా పోస్టర్

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) నటించిన ‘మల్లీశ్వరి’ సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. అందులో వెంకీని అందరూ ‘పెళ్లికాని ప్రసాద్’ అని పిలిచేవారు. దీంతో బాగా పాపులర్ (Popular) అయిన ఈ డైలాగ్‌తో తాజాగా సినిమా రాబోతుంది. ఇందులో ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి (Saptagiri) హీరోగా నటిస్తుండగా.. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ (First look poster) రిలీజ్ చేశారు మేకర్స్. ‘అతను ఒంటరిగా ఉన్నాడు.. కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు... పట్టణంలోకి మోస్ట్ ఎలిజిబుల్ అండ్ రిలేటబుల్ బ్యాచిలర్ సప్తగిరిని స్వాగతిద్దాం.. ఇది అన్ని వయసుల వారికి నచ్చే ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. మార్చి 21న థియేటర్లలో పెళ్లి బాజాలు మోగుతాయి’ అంటూ ఈ సినిమాకు ‘పెళ్లికాని ప్రసాద్’ (Pellikani Prasad) అనే పేరు ఫిక్స్ చేసినట్లు తెలిపారు.
కాగా.. ‘పెళ్లికాని ప్రసాద్’ సినిమాకు అభిలాష్ రెడ్డి గోపిడి (Abhilash Reddy Gopidi) దర్శకత్వం వహిస్తుండగా.. కె.వై. బాబు, భాను ప్రకాశ్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మురళీధర్ గౌడ్, లక్ష్మణ్, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raj)కు చెందిన ఎస్.వి.సి సంస్థ విడుదల చేయబోతుంది. ప్రజెంట్ ఈ సినిమా మోషన్ పోస్టర్ వైరల్ అవుతోంది.