Sai Pallavi: అది చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది.. సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్

by Hamsa |
Sai Pallavi: అది చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది.. సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల ఈ అమ్మడు రియల్ స్టోరీ మేజర్ ముకుంద్ వరదరాజన్ ‘అమరన్’(Amaran) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివ కార్తికేయన్(Siva Karthikeyan) హీరోగా నటించాడు. అయితే రాజ్ కుమార్ పెరియసామి(Rajkumar Periasamy) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రజెంట్ ‘తండేల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘మూడు నాలుగేళ్ల క్రితం నేను మీడియాతో మాట్లాడుతున్నాను.

అప్పుడు ప్రెస్ మీట్ లేదు. ఇంకా కెమెరాల(Cameras)ను ఆన్ చేయలేదు. మలయాళ నటీనటులందరూ(All actors) ఇంత బాగా తెలుగు ఎలా మాట్లాడుతారని ఓ విలేఖరి నన్ను అడిగాడు. నేను మలయాళీని కాదు, తమిళనాడు(Tamil Nadu) నుంచి వచ్చాను అని చెప్పాను. అంతే ఓ మీడియా సంస్థ వారు ‘సాయి పల్లవి తనని మలయాళీ అని పిలిచినందుకు రిపోర్టర్‌పై సీరియస్ అయ్యింది అంటూ పెద్ద హెడ్డింగ్(Heading) ఇచ్చారు. అది చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నేను కేరళ కదా.. తమిళనాడు నుంచి వచ్చానని మాత్రమే చెప్పాను.

ఇదంతా జరిగిన తర్వాత ఒకరోజు ఎయిర్‌పోర్ట్‌లో ఒక మహిళ నా దగ్గరకు వచ్చి మలయాళంలో మాట్లాడింది. అప్పుడు హఠాత్తుగా ‘అయ్యో సారీ, నేను మలయాళం(Malayalam)లో మాట్లాడితే నీకు కోపం రాదు కదా అని అడిగింది. అది విని మరింత బాధపడ్డాను. నేను అలా అనలేదు. ప్రతిసారి నేను వివరిస్తాను. నాకు కేరళ(Kerala) నుంచి నాకు చాలా ప్రేమ వస్తోంది. ‘ప్రేమమ్‌’(Premam) సినిమా నన్ను ఈరోజు ఇలా ఉండేలా చేసింది. నేనెప్పుడూ అలా చెప్పను’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ సాయి పల్లవి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed