MEGHA AKASH: ఎట్టకేలకు ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నితిన్ హీరోయిన్.. నెట్టింట ఫొటోలు వైరల్

by Kavitha |   ( Updated:2024-08-23 14:38:38.0  )
MEGHA AKASH: ఎట్టకేలకు ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నితిన్ హీరోయిన్.. నెట్టింట ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: నితిన్ సరసన ‘లై’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. తన ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో కుర్రకారును ఆకట్టుకుంది. ఆ తర్వాత ఛల్ మోహన్ రంగ, ప్రేమ దేశం, మను చరిత్ర, రాజ రాజ చోర వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అలా తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. అందులో భాగంగా గత ఏడాది ఏకంగా మూడు సినిమాలతో ఆడియన్స్‌ని అలరించింది.

ఇదిలా ఉంటే గత కొన్ని నెలలుగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుతో వివాహం చేసుకోనుందని ఓ పుకారు నెట్టింట షికారు చేసింది. కానీ, దీనిపై మేఘా ఆకాష్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఇక తాజాగా ఈ యంగ్ బ్యూటీ తన పెళ్లి వార్తలను నిజం చేస్తూ నిశ్చితార్థం చేసుకొని ఒక్కసారిగా సడెన్ షాకిచ్చింది.

సాయి విష్ణు అనే కుర్రాడితో ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన మూడు ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆగస్టు 22న ఈ శుభకార్యం జరిగినట్లు చెప్పుకొచ్చింది. కాగా మేఘా ఆకాష్ కాబోయే భర్త ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే వివరాలు అయితే వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

(video link credits to megha akash instagram id)

Advertisement

Next Story