గెట్ రెడీ.. ‘భైరవం’ ఫస్ట్ సింగిల్ వెన్నెల వచ్చేస్తుంది

by Hamsa |
గెట్ రెడీ.. ‘భైరవం’ ఫస్ట్ సింగిల్ వెన్నెల వచ్చేస్తుంది
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) నటిస్తున్న తాజా చిత్రం ‘భైరవం’(Bhairavam). విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్, మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రల్లో కనిపించనుండగా.. అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది(Anandhi) హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మల్టీ స్టారర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్(Pen Studios), శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్స్‌పై జయంతి‌లాల్ గదా నిర్మిస్తున్నారు. తాజాగా, మూవీ మేకర్స్ ‘భైరవం’ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ఓ వెన్నెల అనే మెలోడీ సాంగ్ జనవరి 3న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్‌తో కలిసి మాస్ స్టెప్ వేస్తున్న పోస్టర్‌ను షేర్ చేశారు.

Advertisement

Next Story