- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Allu Arjun: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు భారీ ఊరట
దిశ, వెబ్ డెస్క్: సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theatre Stampade) ఘటనలో అల్లు అర్జున్(Allu Arjun) భారీ ఊరట(Big Rilief) లభించింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు(Nampally Court) ఆయనకు రెగ్యూలర్ బెయిల్(Regular Bail) మంజూరు చేసింది. పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు రావడం కారణంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. దీనిపై కోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో అల్లు అర్జున్ రెగ్యూలర్ బెయిల్ కోరుతూ.. నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు 50 వేల పూచీకత్తుతో రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటు ఇద్దరు వ్యక్తులతో సాక్షి సంతకాలు చేయించాలని షరత్తులు విధించింది. అంతేగాక అల్లు అర్జున్ ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని, పోలీస్ విచారణకు పూర్తిగా సహకరించాలని కోర్టు చెప్పింది.