KCR: రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ మరో ఛాన్స్ మిస్!

by Prasad Jukanti |
KCR: రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ మరో ఛాన్స్ మిస్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రైతు భరోసాపై (Rythu Bharosa) రాజకీయం రంజుగా మారింది. రైతుభరోసా కింద ఏటా రూ.12 వేలు ఇచ్చేందుకు రెడీ అని ప్రభుత్వం చెబుతుంటే ఎన్నికలకు ముందు రూ. 15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ. 12 వేలే ఇస్తామని చెప్పడం మరోసారి రైతులను కాంగ్రెస్ మోసం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో ఇటు అధికార అటు ప్రతిపక్షం మధ్య రైతుభరోసా విషయంలో డైలాగా వార్ పీక్స్ కు చేరుకుంటోంది. ఈ పరిస్థితిని ఎలాగైనా తమకు అనుకూలంగా మలుచుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మైలేజ్ గేయిన్ చేసేందుకు రాజకీయ పార్టీలు వేటికవే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోలన కరంగా ఉన్నా ఇచ్చిన హామీ మేరకు రైతుభరోసా అమలు చేస్తున్నామని ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ (Congress) పక్కా ప్రణాళికలు వేస్తుంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) విషయంలో ఓ టాపిక్ ఆసక్తిని రేపుతున్నది.

కేసీఆర్ రియాక్షన్ ఏంటో?:

ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ఒక్కొక్క అంశాన్ని టచ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే వాటిలోని లోటు పాట్లను కార్నర్ చేయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) మౌనం మరోసారి చర్చగా మారింది. ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్న కేసీఆర్ తాజాగా రైతుభరోసా విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏమీ స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో చర్చగా మారింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించి, సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని అధికార పక్షం ఇప్పటికే ఎటాక్ చేస్తోంది. ఇటువంటి తరుణంలో రైతుబంధు పథకాన్ని రూపొందించి అమలు చేశామని ఆ ఘనత తమ ప్రభుత్వానిదేనని ఘనంగా చెప్పిన కేసీఆర్ రైతుభరోసా విషయంలోనైనా కేబినెట్ నిర్ణయంపై స్పందిస్తే బాగుటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ గులాబీ బాస్ మాత్రం ఇప్పటి వరుకు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రైతుబంధు విషయంలో క్రెడిట్ సంపాధించుకున్న కేసీఆర్ రైతుభరోసా విషయంలో మాట్లాడితే పార్టీకి కలిసి వచ్చేదనే కానీ కేసీఆర్ మాట్లాడకుండా మరోసారి కేటీఆర్ ద్వారానే ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టడం ద్వారా మంచి చాన్స్ కేసీఆర్ మిస్ చేసుకున్నారా అనే అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం అవుతున్నాయి. అయితే అధినేత మౌనంపై గులాబీ క్యాడర్ అంతే స్థాయిలో రియాక్ట్ అవుతోంది. కేసీఆర్ మాట్లాడం కంటే ఆయన మౌనమే ఎక్కువ ప్రమాదకరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కేసీఆర్ మౌనమా? ప్రభుత్వం దూకుడా? ప్రజల నిర్ణయం ఎలా ఉండబోతున్నది అనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story