నరసింహావతారంలో రామయ్య

by Sridhar Babu |
నరసింహావతారంలో రామయ్య
X

దిశ,దుమ్ముగూడెం : పర్ణశాలలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో రూపంలో శ్రీరామచంద్రుడు దర్శనమివ్వ నున్నారు. నాలుగవ రోజైన శుక్రవారం రామయ్య నరసింహావతారంలో భక్తులకు కనువిందు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్ధప్ర సాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ వారిచే మారుతి చిటికెలు హరికథ కాలక్షేపం నిర్వహించారు. అలాగే భద్రాచలం వారి తరుపున ఏర్పాటు చేసిన కోలాట భజనల మధ్య వేదమంత్రోచ్ఛరణ, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధి సేవను ఘనంగా నిర్వహించారు. అధ్యాయనోత్సవాలలో భాగంగా పర్ణశాల రామయ్య శనివారం వామనావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Advertisement

Next Story

Most Viewed