వంతెనకు పొంచి ఉన్న ప్రమాదం

by Naveena |
వంతెనకు పొంచి ఉన్న ప్రమాదం
X

దిశ, అనంతగిరి : అనంతగిరి మండల పరిధిలోని చనుపల్లి గ్రామ శివారులోని పాలెరువాగుపై నిర్మించిన వంతెన ప్రమాదకరంగా మారింది. ఇటు సూర్యాపేట అటు ఖమ్మం జిల్లాకు అనుసంధానంగా ఉన్న ఈ వంతెన అనేక గ్రామాల ప్రజల రాకపోకలకు రవాణాకు ఎంతో ఉపయోగపడుతుంది. 20 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన శిధిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలు నేపథ్యంలో పాలేరు వాగు ఉధృతి వంతెన మీదుగా మీరు ప్రవహించిన నేపథ్యంలో ఫుట్పాత్ పై ఉన్న సిమెంట్ బిళ్ళ లు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏమైనా ప్రమాదాలు సంభవిస్తాయో ఏమనని వాహనదారులు చుట్టుపక్కల, గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed