మాటలు కోటలు.. చేతల్లో కోతలు : హరీష్ రావు

by Kalyani |
మాటలు కోటలు.. చేతల్లో కోతలు :  హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు.. చేతల్లో కోతలు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. మహాలక్ష్మి కింద మహిళలకు ఇస్తామన్నా రూ. 2500 ఊసు లేదు.. తులం బంగారం మాట లేదు.. రుణ మాఫీ సగం చేశారని, రైతు భరోసా కొత్త రూల్స్ పెట్టారని అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో నంగునూర్ మండలం యువజన విభాగం నాయకులతో హరీష్ రావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది లో మాటలు కోటలు...చేతల్లో ఎగవేతలు. కోతలు అని ఎద్దేవా చేశారు. బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు బతుకమ్మ చీరలు, దళిత బంధు, బీసీ బంధు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్టు ను బంద్ చేసి ఆరు గ్యారంటీ లు అటకెక్కించారని అన్నారు. వానకాలం రైతుబంధు అన్నదాతలకు అందించలేదన్నారు. చెరువుల్లో చేప పిల్లల పంపిణీ బంద్ చేశారని గుర్తు చేశారు. ఆరు గ్యారంటీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై పట్టు లేదన్నారు.

పదేళ్లు అభివృద్ధి లో పరుగులు పెట్టిన సిద్దిపేట నియోజకవర్గం ఏడాదిలో ఏడారిగా మారిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి సిద్దిపేట ప్రజలపై కాంగ్రెస్ పార్టీ కక్ష సాధిస్తుందని అన్నారు. శిల్పారామం, రంగనాయక సాగర్ టూరిజం, ఆసుపత్రి, రోడ్లు ఇతర ఎన్నో పనులు అర్ధాంతరంగా ఆపారని తెలిపారు. కొత్తవి ఇవ్వక పొగ పాతవి ఆపడం ఎంత వరకు సమంజసం సూటిగా ప్రశ్నించారు. అభివృద్ధి పనులు అర్ధంతరంగా ఆపడం పై సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రద్దు చేసిన అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదలి పెట్టమని హరీష్ రావు స్పష్టం చేశారు. పార్టీలో యువతకు పెద్ద పీఠ వేస్తామని హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ని ఇంటింటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story