- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గిరిజన హక్కుల పరిష్కారానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది.. మహేశ్ గౌడ్
దిశ, నాగార్జునసాగర్ : జల్-జమీన్-జంగిల్ నీరు, భూమి, అటవీ వనరులు నినాదాన్ని ఆధారంగా తీసుకుని గిరిజనుల హక్కుల సాధనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ఆదివారం నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార హోటల్‌లో నిర్వహించిన ఆదివాసీ శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సహజ వనరుల పై గిరిజనుల హక్కుల కోసం రాహుల్ గాంధీ యాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ప్రధానిగా చూడటం తమ కల అని, ఆ కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా పని చేయాలని సూచించారు. ప్రజల సమస్యలు, బాధలను అర్థం చేసుకోవడమే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లక్ష్యమని వివరించారు.
గిరిజన హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శిస్తూ, రాహుల్ గాంధీ గిరిజన అభివృద్ధి కోసం పరితపిస్తున్న నాయకుడని ప్రశంసించారు. సహజ వనరుల పై గిరిజనుల హక్కుల కోసం రాహుల్ గాంధీ యాత్ర చేశారని గుర్తుచేశారు. ప్రధానిగా రాహుల్ గాంధీ చూడాలని తమ కల అని.. కల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా పని చేయాలని సూచించారు. ప్రజల ఆక్రందన, ఆవేదనను అర్థం చేసుకోవడమే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లక్ష్యమని చెప్పారు. గిరిజనుల హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. గిరిజనుల అభివృద్ధి కోసం పరితపిస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. నాగార్జున సాగర్ అంటేనే శిక్షణ శిబిరాలకు నిలయమని చెప్పారు. బుద్ధుడికి నిలయమైన నాగర్జున సాగర్‌లో గిరిజనులు శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు.
నాగార్జునసాగర్ శిక్షణ శిబిరాలకు నిలయమని, ఈ ప్రాంతం గిరిజన శిక్షణకు అనువుగా ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తోందని, అటవీ హక్కుల చట్టం తీసుకురావడంలో తమ పాత్రను గుర్తుచేశారు. కులగణన సర్వే పై చర్చ కొనసాగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, సర్వే 90% పూర్తయిందని తెలిపారు. గిరిజనులు తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా నిలవాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు.
ఈ శిక్షణ శిబిరంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపా దాస్ మున్షి, కో-ఆర్డినేటర్ కొప్పుల రాజు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఇతర డీసీసీ అధ్యక్షులు, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జై వీర్రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, కార్పొరేషన్ చైర్మన్‌లు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.