- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AAP: అసలైన విపత్తు బీజేపీలోనే ఉంది.. మోడీకి మూడు పాయింట్లతో కేజ్రీవాల్ కౌంటర్
దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీపై(AAP) ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. నరేంద్ర మోడీపై మూడు పాయింట్లతో ఎదురుదాడికి దిగారు. నిజమైన విపత్తు బీజేపీలోనే ఉందని ఘఆటు వ్యాఖ్యలు చేశారు. “అసలైన విపత్తు ఢిల్లీలో కాదు.. బీజేపీలోనే ఉంది. "మొదటిది బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థి లేరు. రెండోది బీజేపీకి విజన్ లేదు. మూడోది ఏంటంటే అసలు ఢిల్లీ ఎన్నికల(Assembly Elections) కోసం బీజేపీకి ఎజెండానే లేదు” అని విమర్శలు గుప్పించారు.
మోడీ ఏమన్నారంటే?
ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారటీ ఆధ్వర్యంలో నిర్మించిన పలు నివాస సముదాయాలను మోడీ ప్రారంభించారు. ఇటీవల జరిగిన సీఎం అధికారిక నివాసంలోని నిర్మాణ పనులను పరోక్షంగా ప్రస్తావించారు. నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించామని, కానీ.. తానేమీ అద్దాల మేడ (Sheesh mahal) కట్టుకోలేదన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీని విపత్తు (AAPda)గా పేర్కొన్నారు. ప్రజలకు సౌకర్యాలను కల్పించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ‘‘మోడీ తన కోసం ఇల్లు కట్టుకోలేదన్న విషయం దేశం మొత్తానికి తెలుసు. అయినా, గత పదేళ్లలో పేదల కోసం 4 కోట్ల ఇళ్లను నిర్మించి వారి కలలను సాకారం చేశాం’’ అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపైనే కేజ్రీవాల్ విమర్శించారు.