Winter Storm : అమెరికాకు ముంచుకొస్తున్న భారీ ముప్పు

by M.Rajitha |
Winter Storm : అమెరికాకు ముంచుకొస్తున్న భారీ ముప్పు
X

దిశ, వెబ్ డెస్క్ : అగ్రరాజ్యం అమెరికా(USA) మరో భారీ ముప్పును ఎదుర్కోబోతోంది. గత పదేళ్ళలో ఎన్నడూ చూడని భారీ మంచు తుఫాను(Winter Storm) అమెరికాను ముంచెత్తనుంది. దాదాపు 15 రాష్ట్రాలకు పైగా భారీ మంచు, వర్షం, అత్యల్ప ఉష్ణోగ్రతలను ఎదుర్కోబోతున్నాయి. 6 కోట్లకు పైగా ప్రజలు ఈ ముప్పు బారిన పడబోతున్నారు. మధ్య అమెరికాలో మొదలైన ఈ భారీ మంచు తుఫాను తూర్పు వైపు కదులుతోంది. మిస్సౌరి నుంచి మధ్య అట్లాంటిక్ వరకు విస్తరించనుందని నేషనల్ వెదర్ సర్వీస్(National Weather Service) వెల్లడించింది. పోలార్ వర్టెక్స్ కారణంగా ప్రతికూల వాతావరణం ఏర్పడనుంది. వారం రోజులపాటు ఉండనున్న ఈ మంచు తుఫాను ప్రాంతాల్లో ప్రయాణాలు అత్యంత ప్రమాదకరం. గడిచిన పదేళ్లల్లో ఇదే అతి తీవ్రమైన తుఫానుగా అక్కడి అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కూడా ఇళ్ళు దాటి బయటికి రావొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Next Story