- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే
దిశ, కొల్లాపూర్ : బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ను శాలువా కప్పి మాజీ ఎమ్మెల్యే బీరం ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గం లో వివిధ అభివృద్ధి పనులతో పాటు..సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్మాణం కోసం రూ,17 కోట్లు మంజూరు చేసిన నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టులో నీటి ముంపుకు గురైన కొల్లాపూర్ నియోజకవర్గంలో గ్రామాల నిర్వాసిత నిరుద్యోగులకు 98 జీవో ప్రకారంగా అర్హత ఉన్న అభ్యర్థులకు దక్కాల్సిన ఉద్యోగాలు ఇవ్వడంలో..కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ దృష్టికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తీసుకొచ్చారు. గతంలో తమ ప్రభుత్వంలో మంజూరు చేసిన పెద్ద కొత్తపల్లి మండలంలోని రైతులకు సాగు నీటి కోసం ఎంజికేఎల్ఐ నీటిని భాచారం హై లెవల్ కెనాల్,పస్పుల కెనాల్ లైనింగ్ పనులు తదితర పనులను చేపట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురిచేసిందని పేర్కొన్నట్లుగా తెలిసింది. మాజీ ఎమ్మెల్యే వెంట పానగల్ మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ఉన్నారు.