Visakha Central Jail:విశాఖ సెంట్రల్ జైల్లో మరో మొబైల్ కలకలం

by Jakkula Mamatha |
Visakha Central Jail:విశాఖ సెంట్రల్ జైల్లో మరో మొబైల్ కలకలం
X

దిశ,వెబ్‌డెస్క్: విశాఖ సెంట్రల్ జైలులో మొబైల్ ఫోన్లు(Mobile Phones) దొరకడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇటీవల రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా పెన్నా బ్యారక్ సమీపంలో పోలీసులకు భూమిలో నాలుగు అడుగుల లోతున పాతి పెట్టిన ఓ అనుమానాస్పద ప్యాకెట్ లభ్యమైంది. ఆ ప్యాకెట్ తెరచి చూడగా అందులో రెండు సెల్‌ఫోన్లు, ఒక పవర్ బ్యాంక్, రెండు ఛార్జింగ్ వైర్లు, ఫోన్ బ్యాటరీ కనిపించాయి. దీంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి విశాఖ సెంట్రల్ జైల్లో(Visakha Central Jail) మొబైల్ ఫోన్ దొరకడం కలకలం రేపింది. నర్మదా బ్లాక్‌లో ఇవాళ(శుక్రవారం) మరో మొబైల్‌ను అధికారులు గుర్తించారు. సిమ్‌ కార్డు లేని మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు సూపరింటెండెంట్‌ మహేశ్‌బాబు నేతృత్వంలో సెంట్రల్‌ జైలులో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. నాలుగు రోజుల క్రితం రెండు మొబైల్‌ ఫోన్లు దొరికిన నేపథ్యంలో నేడు మరోసారి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టగా మరో మొబైల్‌ దొరికింది. ఇప్పటివరకు మూడు మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed