జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం

by Sridhar Babu |
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం
X

దిశ, కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల పారిశ్రామికవాడలోని దూలపల్లిలో గల రిషిక కెమికల్ గోదాంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దూలపల్లి సమీపంలో అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసి పడడం, దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఏం జరిగిందో తెలియక స్థానికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగింది అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed