- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Dil Raju: ‘గేమ్ చేంజర్’ పాటలకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో రివీల్ చేసి షాకిచ్చిన దిల్ రాజు.. (వీడియో)
దిశ, సినిమా: ‘గేమ్ చేంజర్’(Game Changer) సినిమాపై రోజు రోజు అంచనాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఈ మూవీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), శంకర్ కాంబోలో రాబోతుండటంతో ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇందులో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీనిని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘గేమ్ చేంజర్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. దీంతో మూవీ టీమ్ వరుస ఈవెంట్స్‌లో పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచుతున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, ముంబైలో ఈవెంట్‌లో పాల్గొన్న దిల్ రాజు(Dil Raju) ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘ఈ చిత్రంలోని 5 పాటలకు ఏకంగా 75 కోట్లు ఖర్చు చేశాము. ఒక్కో పాట షూట్ చేయడానికి మాకు ఏకంగా 10, 11 రోజులు పట్టింది. అలాగే ఒక్కో పాటను ఒక్కో ప్రాంతంలో తెరకెక్కించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. శంకర్ సర్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇది నా 50వ మూవీ నాకు చాలా స్పెషల్. దీని స్క్రిప్ట్ విన్నాక చాలా బాగా తెరకెక్కించాలని అనుకున్నాం. శంకర్ సార్ జబర్దస్త్‌గా తెరకెక్కించడానికే మూడేళ్లు పట్టింది’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక పాటలకే 75 కోట్లు ఖర్చు పెట్టారని తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.