బ్రేకప్ రూమర్స్.. తమన్నా, అతని బాయ్ ఫ్రెండ్ హోలీ వీడియో వైరల్

by Kavitha |   ( Updated:2025-03-15 13:36:16.0  )
బ్రేకప్ రూమర్స్.. తమన్నా, అతని బాయ్ ఫ్రెండ్ హోలీ వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ‘ఓదెల-2’(Odela-2) సినిమాలో నటిస్తోంది. ఇది సూపర్ హిట్ ‘ఓదెల రైల్వే స్టేషన్‌’(Railway Station)కు సీక్వెల్‌గా వస్తున్న మూవీ. ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్(Teaser) మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. అలాగే మరోపక్క ఐటెమ్ సాంగ్స్‌లో డ్యాన్స్ చేస్తూ తన అందాలతో వావ్ అనిపిస్తుంది.

ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Varma)తో మొన్నటి వరకు పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.అయితే ఈ జంట తాజాగా బ్రేకప్ చెప్పుకున్నారని, ఒకరి ఫొటోలు మరొకరు డిలీట్ చేసుకున్నారని చాలా రూమర్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే వీటిపై వీరిద్దరూ స్పందించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ జంటకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తాజాగా బాలీవుడ్ యాక్టర్ రవీనాటాండన్(Raveena Tandon) ఇంట్లో జరిగిన హోలీ వేడుకలకు(Holi Celebrations) తమన్నా, విజయ్ హాజరయ్యారు. కానీ వీరిద్దరూ విడి విడిగా వచ్చి వెళ్లినట్టు వీడియోను చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి వీరిద్దరూ కలిసి హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed