- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘మజాకా’ నుంచి బేబీ మా సాంగ్ అవుట్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్

దిశ, సినిమా: యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan), స్టార్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన(Trinadha rao nakkina) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘మజాకా’(Mazaka ). ఇక ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రీతు వర్మ(Reethu Varma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ యాక్టర్స్ రావు రమేష్(Rao Ramesh), అన్షు(Anshu) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ మాస్ ఎంటర్‌టైన్మెంట్ చిత్రాన్ని ఎ కె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్(Zee Studios) బ్యానర్స్ పై రాజేష్ దండా(Rajesh Danda), ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు.
అయితే ‘మజాకా’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్‌ను దక్కించుకుని అంచనాలను పెంచాయి. ఇక ఈ సినిమా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అయినట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ‘మజాకా’ నుంచి వరుస అప్డేట్స్‌ను ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా, ఈ సినిమాలోని ‘బేబీ మా’ ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ సమకూర్చగా.. జేమ్స్ లియోన్ ఆలపించారు. కాగా సందీప్ కిషన్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీగానే అంచనాలే ఉన్నాయి. మరి ఈ చిత్రంతో సందీప్ కిషన్ ఎటువంటి విజయం సాధిస్తాడో చూడాల్సి ఉంది.