ఆ స్టార్ హీరోతో మూడు సార్లు అవకాశం వచ్చినా రిజెక్ట్ చేసిన అనుష్క శెట్టి.. ఎందుకంటే?

by Hamsa |   ( Updated:2023-11-09 10:09:33.0  )
ఆ స్టార్ హీరోతో మూడు సార్లు అవకాశం వచ్చినా రిజెక్ట్ చేసిన అనుష్క శెట్టి.. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి సూపర్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అనుష్క ఒకరు. ప్రభాస్ బాహుబలి సినిమాతో అనుష్కకు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఒకప్పుడు అనుష్క స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అనుష్క కేవలం కమర్షియల్, ప్రయోగాత్మక చిత్రాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించి మెప్పించింది. కొద్ది కాలం పాటు ఏమైందో తెలియదు కానీ పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఇటీవల ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

తాజాగా, అనుష్కకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ అమ్మడు స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూడు సినిమాలను రిజెక్ట్ చేసిందట. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాలో రామ్ చరణ్ సరసన నటించే అవకాశం వచ్చిందట. కానీ అనుష్క తన వ్యక్తిగత కారణాల వల్ల నటించలేదట. ఆ తర్వాత ఓ సినిమా కథ మొత్తం విన్నాక నచ్చలేదని చెప్పిందట. అందులో హీరో రామ్ చరణ్ అని తెలుస్తోంది. ఆ తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన గోవిందుడు అందరివాడే సినిమాలోలో కూడా అనుష్కకు ఛాన్స్ వచ్చిందని సమాచారం. ఇతర చిత్రాల షూటింగ్‌లో ఉండటం వల్ల ముచ్చటగా మూడోసారి రామ్ చరణ్ పక్కన నటించే అవకాశం కోల్పోయిందట. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ అనుష్కపై మా హీరో సినిమానే రిజెక్ట్ చేస్తుందా అని రకరకాలుగా అనుకుంటున్నారు.

Advertisement

Next Story