- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Anil Ravipudi: చిన్నోడి సలహా మేరకే పెద్దోడు సినిమా.. వైరల్‌గా అనిల్ రావిపూడి కామెంట్స్

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (sankranthiki vasthunam). మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకోవడంతో పాటు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది. కేవలం 10 రోజుల్లోనే రూ. 230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంక్రాంతి హిట్‌గా నిలిచింది. దీంతో ప్రజెంట్ సక్సెస్ ఎంజాయ్ చేస్తు్న్న చత్ర బృందం వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా అనిల్ రావిపూడి మీడియాతో ముచ్చటిస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
ఈ మేరకు మహేశ్ బాబు (Mahesh Babu) సలహాతోనే ఈ సినిమా తీసినట్లు చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. ‘రజనీకాంత్ (Rajinikanth) ‘జైలర్’ (Jailer) సినిమా చూసి మహేశ్ బాబు నాకు కాల్ చేశాడు. దాదాపు 45 నిమిషాలు మాట్లాడాడు. నువ్వు కూడా ఇలాంటి డార్క్ కామెడీ (dark comedy) సినిమాలు తీయమన్నాడు. నీకు ఆ సత్తా ఉంది. మీరు దాన్ని వాడుకోండి అన్నారు. ఆయన సలహాతోనే ఈ సినిమాకు బీజం పడింది. అక్కడనుంచే సంక్రాంతికి వస్తున్నాం మొదలైంది’ అంటూ అనిల్ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన కామెంట్స్ వైరల్ అవుతుండగా.. చిన్నోడి సలహాతోనే పెద్దోడు సినిమా తీశారా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.