Rashmi: హాస్పిటల్‌ బెడ్‌పై ఉన్న ఫొటో షేర్ చేస్తూ యాంకర్ రష్మి ఎమోషనల్ పోస్ట్.. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్!

by Hamsa |   ( Updated:2025-02-11 07:43:22.0  )
Rashmi: హాస్పిటల్‌ బెడ్‌పై ఉన్న ఫొటో షేర్ చేస్తూ యాంకర్ రష్మి ఎమోషనల్ పోస్ట్.. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్(Rashmi Gautam) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన ఆమె ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లోనూ యాంకరింగ్ చేసిన ఆమె తన అందం, మాటలతో అందరినీ ఫిదా చేసేసింది. అలాగే ఈ అమ్మడు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక అక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మళ్లీ బుల్లితెరపై రాణిస్తోంది. ఇక రష్మీ, కమెడియన్ సుడిగాలి సుధీర్‌(Sudheer)తో ఎన్నో రియాలిటీ షోలు చేసి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను దక్కించుకుంది. అయితే వీరిద్దరు గత కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారనే ప్రచారం నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. కానీ వీరు మాత్రం అవన్నీ పుకార్లే అని కొట్టిపారేసినప్పటికీ నిత్యం రష్మీ, సుధీర్‌కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.

ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే పలు స్పెషల్ షోస్‌లోనూ హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. రష్మి ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, రష్మి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘నేను సర్జరీ చేయించుకోవడానికి అన్ని సెట్ చేసుకున్నాను. నా భుజాన్ని సెట్ చేసుకోవడానికి వెయిట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఆ గాయం నా డ్యాన్స్ మూమెంట్స్ చేయలేకపోతున్నాను. ఆ సర్జరీ అయ్యాక అంతా సెట్ అవుతుంది డ్యాన్స్ చేయగలనని అనుకుంటున్నా’’ అని రాసుకొచ్చింది. సర్జరీ కోసం రెడీ అయి బెడ్‌పై కూర్చున్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం రష్మి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన ఆమె అభిమానులు అసలు ఆమెకు ఏమైందో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు.

Next Story