Aishwarya Rai: ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఐశ్వర్యరాయ్..? హాస్పిటల్‌లో చేరిక.. ఆందోళనలో ఫ్యాన్స్

by Kavitha |
Aishwarya Rai: ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఐశ్వర్యరాయ్..? హాస్పిటల్‌లో చేరిక.. ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, విశ్వసుందరి ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్‌(Abhishek Bachchan)ను పెళ్లి చేసుకుంది. కాగా వీరికి ఆద్య(aadya) అనే ఒక పాప కూడా పుట్టింది. ఇక వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారనే ఓ పుకారు బాలీవుడ్(Bollywood) మీడియాలో కోడై కూస్తోంది. అయితే వీటిపై వీరిద్దరు స్పందించకపోవడంతో ఈ రూమర్ రూమర్‌గానే మిగిలి పోయింది.

ఇదిలా ఉంటే.. ఈ మధ్య ఐశ్వర్యరాయ్ లుక్స్ పై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే రీసెంట్‌గా పారీస్‌లో జరిగిన ఫ్యాషన్‌ వీక్‌లో రియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ బ్యూటీ పాల్గొంది. అయితే ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న ఈ భామ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో నెటిజన్లు ఆమె ఫేస్‌పై షాకింగ్ కామెంట్స్‌తో పాటు మీమ్స్ కూడా చేశారు. ఇక ఇలా ట్రోల్స్ చేయడంతో రెడ్డిట్(Reddit) యాప్‌లో ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో.. గత కొద్ది రోజులుగా ఐశ్వర్యరాయ్ ఆరోగ్య సమస్యలతో పోరాడుతోందని, ఈ కారణంతోనే ఆమె ఎలాంటి మందులు తీసుకోలేకపోతుందని, అందుకే ఆమె మొహం అలా అయిపోయింది అంటూ ఒక సంచలన పోస్ట్ పెట్టారు. ఈ విషయం తెలిసిన ఆమె ఫ్యాన్స్.. విశ్వసుందరి అయినటువంటి ఐశ్వర్య రాయ్‌కి ఉన్నటువంటి ఆ ప్రాణాంతకమైన వ్యాధి ఏంటి అని.. అందుకే ఐశ్వర్యరాయ్ తన ఫేస్‌కి సంబంధించి ఎలాంటి మందులు వాడలేక పోతుందా అని.. ఐశ్వర్యారాయ్‌కి నిజంగానే అనారోగ్య సమస్యలు వచ్చాయా.. లేక రూమర్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొంత మందేమో ఐశ్వర్యరాయ్‌ని హాస్పిటల్‌కి వెళ్లి మంచి ట్రీట్మెంట్ తీసుకోమని సజెస్ట్ చేస్తున్నారు. మరి ఐశ్వర్యారాయ్‌కి ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ వస్తున్న వార్తల్లో నిజమెంతుందో తెలియనప్పటికీ ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Advertisement

Next Story

Most Viewed