మెగా డాటర్ Niharika కోసం చెన్నై నుంచి స్పెషల్ ఐటమ్ తెప్పించా.. హీరో Sumanth Ashwin కామెంట్స్ వైరల్..

by Hamsa |   ( Updated:2023-07-16 07:12:20.0  )
మెగా డాటర్ Niharika కోసం చెన్నై నుంచి స్పెషల్ ఐటమ్ తెప్పించా.. హీరో Sumanth Ashwin కామెంట్స్ వైరల్..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ‘తూనీగ తూనీగ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలేవి కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి. సుమంత్ మెగా డాటర్ నిహారిక కలిసి నటించిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమంత్ మెగా డాటర్‌పై ఆసక్తకర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ ఆమె అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది.. స్టార్ డాటర్ అనే ఈగో ఏ మాత్రం కూడా కనిపించదు. చాలా సింపుల్ గా ఉండి అందరితో ఫ్రెండ్లీగా కలిసిపోతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే నిహారిక పుట్టినరోజు రాగా.. దీంతో చెన్నై నుంచి నా కజిన్ వస్తుంటే నిహారిక కోసం ప్రత్యేకంగా కేక్ తెప్పించి మరీ సెట్ లో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసాము’’ అంటూ ఒకప్పుడు జరిగిన సందర్భాన్ని సుమంత్ గుర్తు చేసుకున్నాడని తెలుస్తోంది.

Also Read: ఆ సినిమా చూసిన మహిళలు నన్ను చంపాలని ప్లాన్ చేశారు.. విజయ్ కామెంట్స్ వైరల్..

Advertisement

Next Story