తెలంగాణలో సినిమా థియేటర్లు బంద్..

by Shyam |   ( Updated:2021-04-20 07:27:06.0  )
తెలంగాణలో సినిమా థియేటర్లు బంద్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సినిమా హాల్స్ మూసివేస్తున్నట్టు మూవీ థియేటర్స్ యజమానుల అసోసియేషన్ ప్రకటించింది. ఈ నెల 20 నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలవుతుండటంతో ఆ ప్రభావం సినిమా థియేటర్లపైనా కనిపించనుంది. ఉద్యోగులు, కుటుంబాలతో వచ్చేవారు ఎక్కువగా సాయంత్రం, రాత్రి పూట సినిమాలకు వస్తుంటారు. రాత్రి 9 గంటలకు కర్ఫ్యూ ప్రారంభమవుతుండటంతో ఈ రెండు షో లకు వచ్చేవారికి ఇబ్బందులు తప్పవు.

ఇక మార్నింగ్, మ్యాట్నీ షోలకు వచ్చేవారి సంఖ్య తక్కువగానే ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో నిర్వాహణ అదనపు భారంగా మారుతుందని ఓనర్స్ చెబుతున్నారు. ప్రభుత్వం నిబంధనలను సడలించేవరకు పూర్తిగా సినిమా హాల్స్‌ను మూసివేస్తున్నట్టు అసోసియేషన్ తెలిపింది. ఈ నిర్ణయంతో జంట నగరాల్లోని 150కు పైగా సినిమా హాళ్లతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆరొందల పైగా సినిమా హాల్స్ బధవారం నుంచి మూతపడనున్నాయి.

Advertisement

Next Story