నడిరోడ్డుపై పోలీసులకు పట్టుబడిన సీఐ కొడుకు.. కానిస్టేబుల్ కు షాకిచ్చిన సీఐ

by Anukaran |   ( Updated:2021-05-12 07:32:22.0  )
నడిరోడ్డుపై పోలీసులకు పట్టుబడిన సీఐ కొడుకు.. కానిస్టేబుల్ కు షాకిచ్చిన సీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ని అమలు చేస్తున్నాయి. ఇక లాక్ డౌన్ సమయంలో ఎవరైనా బయటతిరిగితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిలిన సమయంలో బయట కనిపిస్తే చితకొట్టేస్తున్నారు. అయినా, కొంతమంది ఇవేమి పట్టించుకోకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు, వారికి బుద్ధిచెప్పడానికి పోలీసులు వారి వద్ద నుండి ఫైన్లను వసూల్ చేస్తున్నారు. ఐతే ఓ పోలీస్ అధికారి మాత్రం కర్ఫ్యూ సమయంలో బయట తిరుగుతున్న తన సొంత కుమారుడిని సైతం వదలలేదు. చట్టం ముందు అందరు సమానమే అంటూ కుమారుడికి కూడా ఫైన్ వేసి, వార్నింగ్ ఇచ్చి పంపాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేరులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేరులో సీఐ జయరామయ్య రోడ్లపై విధులు నిర్వహిస్తున్నారు. వచ్చినా వారివద్ద నుండి ఫైన్లను వసూల్ చేస్తున్నాడు. ఇంతలోనే కానిస్టేబుల్ ఒక 20 ఏళ్ళ కుర్రాడ్ని తీసుకొచ్చి ఇతను బయట తిరుగుతూ కనిపించాడని సీఐ కి చెప్పాడు. తీరా చూస్తే ఆ అబ్బాయి.. సీఐ జయరామయ్య కుమారుడు, బీటెక్ స్టూడెంట్ రాహుల్. ఇది తెలిసిన కానిస్టేబుల్ సారీ సర్.. మీ అబ్బాయి అని తెలియక తీసుకొచ్చా అని బదులిచ్చాడు. వెంటనే సీఐ జయరామయ్య చట్టం ముందు అందరు ఒకటే.. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాలని తెలుపుతూ సొంత కుమారుడికి సైతం రూ. 125 ఫైన్ వేశాడు. అంతేకాకుండా ఇలాంటి సమయంలో బయట తిరిగితే ఇంకోసారి కఠిన చర్యలు తీసుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తన మన అనే బేధం లేదని.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఇంట్లోనే ఉండాలని ఆయన అన్నారు. సీఐ జయరామయ్య చేసిన పనిని పలువురు ప్రశంసిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed