- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ బ్రేకింగ్ : శివశంకర్ మాస్టర్ ఇకలేరు..
దిశ, వెబ్‌డెస్క్ :ప్రముఖ కొరియోగ్రాఫర్, యాక్టర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. కొవిడ్ మహమ్మారి బారిన పడిన ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె ప్రస్తుతం హోం క్యారంటైన్ లో ఉన్నారు. ఇక మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ ఇన్నిరోజులు తన తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటూ వచ్చారు.
కరోనా బారిన పడ్డాక మాస్టర్ ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకిందని..75 శాతం చెడిపోవడంతో ఆయనకు ఇన్ని రోజులు చికిత్స అందిస్తూ వచ్చామని వైద్యులు వెల్లడించారు. శివశంకర్ మాస్టర్ మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.కాగా, శివశంకర్ మాస్టర్‌కు చికిత్స అందించే క్రమంలో ఆస్పత్రి ఖర్చులకు కూడా డబ్బులు లేవని వారి కుటుంబసభ్యులు ఆర్థిక సాయం కోసం ఎదురుచూసిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, శివశంకర్ మాస్టర్ ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో చాలా సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.