Cisf jawan : సర్వీస్ గన్‌తో కాల్చుకుని సీఐఎస్ఎఫ్ జవాన్ సూసైడ్.. సూరత్ ఎయిర్ పోర్టులో ఘటన

by vinod kumar |
Cisf jawan : సర్వీస్ గన్‌తో కాల్చుకుని సీఐఎస్ఎఫ్ జవాన్ సూసైడ్.. సూరత్ ఎయిర్ పోర్టులో ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌(Gujarath) లోని సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయం(surath International airport) లో విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యురిటీ ఫోర్స్ (CISF)కు చెందిన జవాన్ తన సర్వీస్ గన్‌తోనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌కు చెందిన కిసాన్ సింగ్ (32) అనే జవాన్ ఎయిర్ పోర్టులో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో విమానాశ్రయంలోని వాష్ రూమ్‌కు వెళ్లిన కిసాన్ తన రివాల్వర్‌తో కడుపులో కాల్చుకున్నారు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయనను ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించలేదు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు డుమాస్ పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి భర్వాద్ తెలిపారు. ఈ ఘటనతో విమానాశ్రయ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా, 2024లో జవాన్ల ఆత్మహత్యలు 40శాతం తగ్గాయని సీఐఎస్ఎఫ్ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మరో జవాన్ సూసైడ్ చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed