మరో 4రోజుల్లో పెళ్లి.. నిరాకరించిన వరుడు.. ఇంతలో వధువు..

by srinivas |
మరో 4రోజుల్లో పెళ్లి.. నిరాకరించిన వరుడు.. ఇంతలో వధువు..
X

దిశ, వెబ్ డెస్క్: ఆ ఇద్దరికీ పెళ్లి నిశ్చయమైంది. ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. పెళ్లి నిశ్చయం కావడంతో ఆ యువతి ఎన్నో కలలు కన్నది. మరో ఐదురోజుల్లో పెళ్లి ఉందనగా వరుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు టౌన్ కి చెందిన సుష్మ డల్లాస్ లో ఎంఎస్ చదువుతుంది. ఆమెకు పూతలపట్టుకు చెందిన భరత్ తో పెళ్లి నిశ్చయించారు. పెళ్లి నశ్చయమైన కొన్ని రోజుల వరకు బాగానే ఉన్న భరత్ ఆకస్మాత్తుగా పెళ్లికి నిరాకరించాడు. ఈనెల 4న అంటే ఇవాళ పెళ్లి జరగాల్సి ఉంది. భరత్ నిరాకరించడంతో సుస్మ తట్టుకోలేకపోయింది. ఆత్మహత్యకు పాల్పడింది. వివాహం రద్దు అవ్వడంతోనే మనస్తాపానికి చెంది ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. భరత్ కుటుంబ సభ్యులపై పోలీసులకు సుష్మ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story