- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెగాస్టార్ చిరంజీవిపై విషప్రయోగం.. ఎప్పుడు జరిగిందంటే..?
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు.. ఆయన ఎంతోమందికి ఆదర్శం.. ఇండస్ట్రీకి వచ్చే కొత్త తరానికి డిక్షనరీ.. ఒంటరిగా పోరాటం మొదలుపెట్టి విలన్ నుంచి స్టార్ హీరోగా మారిన ఆయన కథ ఎంతోమందికి స్ఫూర్తి. ఒకానొక టైమ్ లో చిరు చేసిన సినిమాలను అప్పట్లో స్టార్స్ గా ఉన్నవారు కూడా బీట్ చేయలేకపోయారు. చిరు డాన్స్, గ్రేస్ అలాంటివి. సాధారణంగా ఒక ఇండస్ట్రీలో ఎవరైనా ఒకరు ఎదుగుతున్నారు అంటే వారిని అంతమొందించడానికి శత్రువులు పుట్టుకొస్తూనే ఉంటారు. అందులో మెగాస్టార్ కి తక్కువేం లేదు. ఆయనకు కనపడని శత్రువులు చాలామంది ఉన్నారు. ఆయన ఎదుగుదలను తట్టుకోలేని కొందరు ఆయనపై విష ప్రయోగానికి కూడా సిద్దపడ్డారట. అప్పట్లో జాతీయస్థాయి వార్తా పత్రికలో కూడా ఈ విషయం సంచలనం రేపింది.
1988లో ‘మరణ మృదంగం’ చిత్ర షూటింగ్ జరుపుకొంటుంది. మద్రాస్ బేస్ కోర్టులో షూటింగ్ జరుగుతున్న సమయంలో వేల సంఖ్యలో అభిమానులు చిరును చూడడానికి క్యూ కట్టారు. అందులో ఒక అభిమాని తన పుట్టిన రోజు అని, ఎప్పటి నుంచో మీ సమక్షంలో కేక్ కట్ చేయాలని అనుకుంటున్నాను అంటూ చిరంజీవికి చెప్పాడు. అయితే అభిమాని అని చెప్పడంతో చిరు కూడా ఏం మాట్లాడకుండా ఓకే అన్నారు. కేక్ కట్ చేసిన అతను చిరు నోట్లో పెట్టబోయాడు. చిరు వద్దని తిరస్కరించినా అతను వినకుండా బలవంతగా కేక్ తినిపించబోయాడు. దీంతో ఆ కేక్ ముక్క కాస్తా కిందపడడం అందులో ఒక బ్రౌన్ కలర్ పౌడర్ బయటపడడం జరిగాయి. దీంతో ‘మరణ మృదంగం’ చిత్ర యూనిట్ కంగారు పడింది.
కేక్ అంటుకున్న చిరంజీవి పెదాల రంగు కూడా మారడంతో వెంటనే ఆయనపై విష ప్రయోగం జరిగి ఉంటుందని భావించి హుటాహటిన ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఇక ఈ విషయం అప్పట్లో సంచలంగా మారింది. చిరు ప్రాణాలకు ప్రమాద లేదని తెలియడంతో, తృటిలో ప్రమాదం తప్పిందని అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఆ మరుసటి రోజే రాష్ట్ర, జాతీయ వార్తా పత్రికలలో చిరుపై విషప్రయోగం జరిగింది అంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే చిరుపై విష ప్రయోగం చేయించిన వారెవరు అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఏదిఏమైనా చిరు క్రేజ్ ని తట్టుకోలేని వారు ఈ పనికి ఒడిగట్టినట్లు వార్తలు గుప్పుమన్నాయి. విషప్రయోగం చేసేవరకు వెళ్లారంటే చిరు క్రేజ్ ఎలాంటిదో చెప్పనక్కర్లేదు. అప్పటికి, ఇప్పటికి ఆయన క్రేజ్ లో మార్పు రాలేదు. ఎప్పటికీ ఆయనే మెగాస్టార్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.