నేను అతన్ని నమ్మాను.. కానీ ఆ వ్యక్తి ప్రేమిస్తున్నట్టు నమ్మించి మోసం చేశాడు .. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-11-18 14:31:51.0  )
నేను అతన్ని నమ్మాను.. కానీ ఆ వ్యక్తి ప్రేమిస్తున్నట్టు నమ్మించి మోసం చేశాడు .. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార లైఫ్ స్టోరీతో తెరకెక్కిన డాక్యుమెంటరీ నేడు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. ఇందులో తన ప్రేమ, పెళ్లి, ఫ్యామిలీ ఇలా అన్ని విషయాలు మాట్లాడింది. ఈ క్రమంలో నయన్ తన రిలేషన్ షిప్ గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ డాక్యుమెంటరీలో నయనతారతో పాటు ఆమెతో పనిచేసిన పలువురు హీరోలు, డైరెక్టర్స్, టెక్నిషియన్స్ కూడా కనిపించి నయన్ గురించి మాట్లాడారు. ఈ క్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. ‘నయానతార రిలేషన్ షిప్‌లో ప్రాబ్లమ్ ఉందని అనిపించేది. ఆమె ఫోన్ రింగ్ అయితే చాలు సెట్‌లో అందరికి భయమేసేది. ఎప్పుడూ ఫోన్‌లో గొడవలు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే నయన్ మూడ్ అంతా మారిపోయేది’ అని తెలిపారు.

దీనిపై నయనతార స్పందిస్తూ.. ‘రిలేషన్ షిప్ అనేది నమ్మకం మీదే కొనసాగుతుంది. నేను అతన్ని నమ్మాను. అవతలి వ్యక్తి కూడా నన్ను ప్రేమిస్తున్నారని అనుకున్నాను కానీ అలా నన్ను నమ్మించాడు అంతే. అయితే నా పాస్ట్ రిలేషన్ షిప్ గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు. కానీ జనాలు ఇష్టమొచ్చినట్టు అనుకున్నారు. ఒక అమ్మాయి గురించి కాబట్టే ఇలా మాట్లాడారు, నన్ను ప్రశ్నించేవారు, నా గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. మగాళ్లని ఎందుకు ఇలా చేశావు అని ఎవరూ అడగరు కానీ అమ్మాయిలను అడుగుతారు. తప్పంతా నేనే చేసినట్టు రాస్తారు ఇది కరెక్ట్ కాదు’ అంటూ నయనతార ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా అతను ఎవరన్నది మాత్రం వెల్లడించక పోవడం గమనార్హం.

Read More...

Nayanthara : కర్ర, కత్తి పట్టుకొని ఎర్ర చీరలో అదిరిపోయే ఫైట్ చేసిన నయనతార.. టీజర్ అదిరిందిగా..!



Advertisement

Next Story