- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రాజెక్ట్ ఆపండి..ప్రాణాలు కాపాడండి..: ముంపు బాధితులు
దిశ, నల్లబెల్లి/నర్సంపేట: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని రంగాయ చెరువు, ఎర్ర చెరువులతో రిజర్వాయర్ చేయాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరుతూ నల్లబెల్లి తహసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. రిజర్వాయర్ ఏర్పాటుతో దాదాపు 10పైగా తండాలు కాలగర్భంలో కలిసిపోయే అవకాశం ఉన్నట్లు రంగాయ చెరువు రిజర్వాయర్ వ్యతిరేక పోరాట కమిటీ బాధ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలలుగా వివిధ పద్ధతుల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గ్రూపుగా చేరిన ముంపు గ్రామాల ప్రజలు నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తమ ఆందోళనను చేపట్టారు. ఈ క్రమంలోనే తహశీల్దార్ కి తమ ఆవేదనను వినతిపత్రం రూపంలో అందజేశారు.
వినతిపత్రంలో వివరాలివే..!
నల్లబెల్లి మండలం గోవిందాపూర్ శివారులోని రంగాయ, ఎర్ర చెరువులను కలిపి 1టీ.ఎం.సీ నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ ని రూ. 305 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం సంకల్పించినట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ రిజర్వాయర్ ఏర్పాటుతో శివారు గ్రామాలైన పాత గోవిందాపురం, కొత్త గోవిందాపురం, లైన్ తండా, ముడుచెక్కలపల్లి, ఎర్ర చెరువు తండ, బుల్యతండ, కొండాపురం, మురళి నగర్, గణేష్ నగర్, ఆసరవెల్లి, లక్ష్మీ తండ గ్రామాలతో పాటుగా 3194 ఎకరాల భూమి, ముంపుకు గురై సుమారు 10 వేల మంది ప్రజల నిల్వ నీడ లేకుండా పోయి నిర్వాసితులు గా మారే ప్రమాదం ఉన్నట్లు స్పష్టం చేశారు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రీడిజైన్ చేసి కాలువల ద్వారా నీటి సరఫరా చేపట్టడంతో పేద ప్రజల ఆవాసాలకు నష్టం రాలేదన్నారు. గడిచిన మూడు నెలలుగా మళ్లీ రిజర్వాయర్ ఏర్పాటు అంశం ఆచరణలోకి వస్తుందనడం ఆందోళన కలిగిస్తున్నట్లు బాధిత ముంపు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్న ఆదివాసీ, దళిత, గిరిజనేతర, పేదలు, భూములు, నివాసాలు కోల్పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పునరాలోచన చేయాలని, ప్రాజెక్టు ప్రతిపాదనలు రద్దు చేయాలని ముంపు గ్రామాల ప్రజలు తరపున కమిటీ సభ్యులు కోరుతున్నారు.