- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రశాతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్షలు
by Naveena |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ నవంబర్ 18: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్ - 3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును ఆయన నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించి పలు సూచనలు చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ సాఫీగా పరీక్షలు నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. సోమవారం జరిగిన పరీక్షకు జిల్లాలో మొత్తం 19,941 మంది అభ్యర్థులకు గాను, 9,880 మంది హాజరు కాగా, 10,058 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు. సగటున 49.54 శాతం హాజరు నమోదయ్యిందని అన్నారు.
Advertisement
Next Story