- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రాణం పోయినా పాడు పనులు చేయను.. వైరల్ వీడియోపై స్పందించిన పూజారి
దిశ, వెబ్ డెస్క్: వినుకొండ ప్రసన్న రామలింగేశ్వర-కోదండరామస్వామి దేవస్థానం(Vinukonda Prasanna Ramalingeswara-Kodandaramaswamy Devasthanam) గర్భగుడిలో పూజారి ప్రసాద్ (Priest Prasad) మద్యం సేవిస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియో అయింది. దీంతో గుడిని పూజారి అపవిత్రం చేశారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీంతో ఈ ఘటనపై దేవాదాయ శాఖ ఈవో స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారం పూజారి ప్రసాద్‌కు నోటీసులు జారీ చేశారు.
పూజారి ప్రసాద్ మాట్లాడుతూ ‘‘అన్యమతస్తులను గుడిలోకి రావద్దని చెప్పటం వల్లే కొందరు కుట్ర పన్ని ఇలా చేశారు. కార్తీక మాసం సందర్భంగా తాను ఎలాంటి ఆహారం తీసుకోనని, కేవలం జ్యూస్ మాత్రమే తాగుతా. దాన్ని ఇలా మద్యం అని తప్పుదోవ పట్టించారు. నాకు మద్యం సేవించే అలవాటు లేదు. ప్రాణం పోయినా అలాంటి పాడు పనులు చేయను. నాకు నోటీసులు అందాయి. అధికారులకు వివరణ ఇచ్చారు. నిర్ణయం అధికారులకే వదిలేశా. ’’ అని చెప్పారు.