- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దొంగతనం జరిగిన..మరుసటిరోజే దొంగతనం
దిశ ,ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్ - కోటార్ మూర్ ఏరియాలో దొంగతనం జరిగింది. ఆరో వార్డు పరిధిలో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దొంగలు బీభత్సం సృష్టించారు. శనివారం రాత్రి ఓ ఇంట్లో గుర్తుతెలియని దొంగలు పడి చోరీ జరిగిన విషయం తెలిసిందే. మరుసటిరోజే ఆదివారం భారీ చోరీ జరిగింది. ఎస్ టివో గా విధులు నిర్వహిస్తున్న తాజుద్దీన్ ఇంటి తలుపులు గుర్తుతెలియని దొంగలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. దీంతో లక్ష రూపాయల నగదు, 10 తులాల బంగారం, 5 తులాల వెండి ఆభరణాలను అపహరించుకు వెళ్లారు. చోరీ జరిగిన ఎస్ టి వో తాజుద్దీన్ ఇంటిని సోమవారం ఆర్మూర్ పోలీసులు పరిశీలించి..క్లూస్ టీం బృంద సభ్యులతో ఆధారాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆర్మూర్ ఎస్సై ఇంద్రకరణ్ రెడ్డి, ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.