సీఎం గారు త్వరగా కోలుకోవాలి.. చిరంజీవి, మహేశ్ బాబు ట్వీట్

by vinod kumar |   ( Updated:2021-04-19 20:59:31.0  )
Chiranjeevi, KCR
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి భయంకరంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యులకే కాకుండా సినీ, రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు అనేక మంది ఇప్పటికే కరోనా బారినపడ్డారు. తాజాగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా సోకింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. వైద్య నిపుణుల సలహా మేరకు ఆయన తన ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు.

అయితే కేసీఆర్‌కు కరోనా సోకిందని తెలియగానే సినీ, రాజకీయ రంగ ప్రముఖులు షాకయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.. కరోనాను నుంచి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను’ అని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘కేసీఆర్‌ గారు తొందరగా కోలుకోండి సర్‌. మీకోసం ప్రార్థిస్తున్నాను’ అని సూపర్ స్టార్ మహేశ్ బాబు తెలిపారు. అంతేగాకుండా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, కమెడియన్, ప్రొడ్యుసర్ బండ్ల గణేశ్, డైరెక్టర్ శ్రీను వైట్ల, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మా సంస్థ ప్రతినిధులు సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Advertisement

Next Story