ఎంతవరకు సమంజసం? మీరే ఆలోచించండి : మెగాస్టార్

by Anukaran |   ( Updated:2021-04-22 06:52:53.0  )
megastar Chiranjeevi
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ ఉక్కు ఉద్యమానికి సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు చిరంజీవి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కాలేజీ రోజుల్లోనే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నానని, ఆ సమయంలో విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని బ్రష్‌తో రాశానని చెప్పారు. తాజాగా.. మరోసారి స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణపై మెగాస్టార్ స్పందించారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదకగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘దేశమంతా ఆక్సిజన్ దొరక్క కరోనా పేషెంట్స్ అల్లాడిపోతున్నారు. ఈరోజు ఓ స్పెషల్ ట్రైన్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చేరింది. అక్కడ నుంచి 150 టన్నుల ఆక్సిజన్‌ను మహారష్ట్ర తీసుకెళ్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకి సుమారు 100 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించి, లక్షల మంది ప్రాణాలను నిలబెడుతుంది. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని ప్రైవేట్ పరం చేయటం ఎంతవరకు సమంజసం? మీరే ఆలోచించండి’’ అని ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు.

Advertisement

Next Story