చిరుతో లవ్‌లీ హీరో.. మెమొరబుల్ పిక్

by Jakkula Samataha |   ( Updated:2020-05-19 02:48:55.0  )
చిరుతో లవ్‌లీ హీరో.. మెమొరబుల్ పిక్
X

డైలాగ్ కింగ్ సాయికుమార్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది.. డెబ్యూ మూవీ ‘లవ్‌లీ’తో హిట్ కొట్టాడు. కెరీర్ మొదట్లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ కుర్ర హీరో.. ఈ మధ్య కాస్త రేసులో వెనకబడటంతో తన పేరును ‘ఆది సాయికుమార్’గా మార్చుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నటనలో మంచి ఈజ్ కనబరిచే ఈ యంగ్ హీరో.. తండ్రి మాదిరే డైలాగ్స్ కూడా ఇరగదీస్తాడు. అయితే సినిమాల్లోకి వచ్చేందుకు స్ఫూర్తినిచ్చింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి అని చెబుతుండటం విశేషం. ఆయనను చూసే డ్యాన్స్, యాక్టింగ్‌పై ఆదికి ఆసక్తి కలిగిందట.

View this post on Instagram

#majorthrowback @chiranjeevikonidela kalikalam 100 days function taking the award on behalf of dad .

A post shared by ActorAadi (@aadipudipeddi) on May 18, 2020 at 10:04pm PDT

ఇదిలా ఉంటే, తన అభిమాన నటుడు చిరంజీవి నుంచి అవార్డు అందుకున్న ఆది.. తాజాగా ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 1991లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కలికాలం సినిమా అప్పట్లో వంద రోజులు ఆడింది. ఈ చిత్రంలో చంద్రమోహన్, జయసుధ హీరో హీరోయిన్లు కాగా.. సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్‌కు చిరంజీవి అతిథిగా విచ్చేశారట. కానీ ఆ సమయంలో అవార్డు అందుకునేందుకు సాయి కుమార్ అందుబాటులో లేకపోవడంతో.. తండ్రి తరపున చిరు చేతుల మీదుగా అవార్డు స్వీకరించాడు ఆది. ఈ ఫోటోలో చిరు ఆదిని ఎత్తుకుని మరీ అవార్డు అందించారు. కాగా ఈ క్యూట్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertisement

Next Story