- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాంగాంగ్ కేంద్రంగా చైనా కీలక నిర్ణయం..
దిశ, వెబ్‌డెస్క్ : భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై చైనా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. గత కొంతకాలంగా తూర్పు లద్దాఖ్ లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతున్నట్లు బుధవారం ప్రకటించింది. దీంతో చైనా బలగాలను వెనక్కి పిలిపించినట్లు డ్రాగన్ కంట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా భారత రక్షణశాఖ సైతం తమ సైనికుల మొహరింపును ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది.
కమాండర్ల స్థాయి చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ఇదిలాఉండగా, గత జూన్ నెలలో గాల్వాన్ వ్యాలీలో పహారా కాస్తున్న భారత జవాన్లపై చైనా సైనికులు రాత్రివేళ అక్రమంగా రాడ్లు, కర్రలు, బండరాళ్లతో దాడికి పాల్పడిన ఘటనలో మనవాళ్లు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, భారత ఆర్మీ దీటుగా బదులివ్వడంతో చైనా ఆర్మీ సుమారు 50కు పైగా జవాన్లు కోల్పోయినట్లు పలు కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే.